Archive for the ‘అన్నదమ్ముల్లా విడీపోదాం ! – ఆత్మీయుల్లా కలిసుందాం !!’ Category

తెలంగాణ కోరుకుంటున్నదీ ఇదే. అన్నదమ్ముల్లా విడిపోదాం! ఆత్మీయుల్లా కలిసుందాం!!

చిల్ బ్రేకప్

chillbreakup-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

పావని, కళ్యాణ్ మంచి స్నేహితులు. ఈ మధ్య వారి స్నేహం చెడిపోయింది. సింపుల్‌గా ఎస్‌ఎంఎస్ చేసి కటీఫ్ చెప్పాడు కళ్యాణ్. ఇప్పుడు వారి మధ్య నో ఫోన్స్, నో మిస్డ్ కాల్స్ అనుకుంటున్నారేమో! అదేంలేదు. ఒక లేట్ నైట్ ఫోన్ కాల్స్ తప్ప. 

బాలు బైక్‌పై ఒక అమ్మాయితో అపర్ణకి కనిపించాడు. ఇంకేముందీ ఇద్దరి లవ్‌కి బ్రేక్ పడింది. ఆ అమ్మాయి ఎవరో చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదా అపర్ణా?… ఇచ్చింది. మాట్లాడుకున్నారు. ఫ్రెండ్లీగానే విడిపోయారు. బ్రేకప్ పార్టీ ఇచ్చి మరీ విడిపోయారు. 

రియల్లీ.. 
బ్రేకప్ ఇప్పుడొక సెలవూబేషన్. స్నేహితులు.. ప్రేమికులు ‘బ్రేకప్ పార్టీ’తో విడిపోవడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది. 
ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అమితాబ్ బచ్చన్.. మిగిలినవారంతా ఇండియా గెలిస్తే.. ‘డెయిరీ మిల్క్’ తిందామని ఎదురుచూస్తుంటారు. బట్.. ఇండియా ఓడిపోతుంది. అయితేనేం.. పాకిస్తాన్ గెలిచిందిగా! అని డెయిరీ మిల్క్ తినేస్తారు అందరూ. 
‘తియ్యని వేడుక చేసుకుందాం..’ అంటాడు అమితాబ్. 
ఈ ఇన్‌స్పిరేషన్‌తోనే సెలవూబేట్ చేసుకోవడానికి.. గెలుపయితేనేం. ఓటమయితేనేం? అంటోంది నేటితరం. 
విడిపోవడం అంటే.. ఓడిపోవడం. 
కానే కాదు.. మళ్లీ కలవాలంటే.. విడిపోక తప్పదుగా అన్నది కొత్త సిద్ధాంతం. 
ఫ్రెండ్లీగా విడిపోతే తప్పులేదు. 
అసలు ఈ ఐడియా బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీది. 
ఇక్కడ ఆయన తీసిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమా గురించి చెప్పుకోవాలి. 
సైఫ్ ఆలీఖాన్, దీపికా పదుకోన్ అందులో హీరో హీరోయిన్లు. ఇద్దరూ అమెరికాలో ఉంటుంటారు. దీపికా తన ప్రొఫెషన్‌ని ఇండియాలో కొనసాగించాలనుకుంటుంది. సైఫ్ యుఎస్‌లోనే సెటిలవ్వాలనుకుంటాడు. ఈ డిఫన్స్ వల్ల ఇద్దరూ విడిపోవాలనుకుంటారు. అదీ ఫ్రెండ్లీగా. ఇట్స్ ఏ కూల్ బ్రేకప్ అన్నమాట. ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పార్టీ ఇచ్చి మరీ విడిపోతారు. 
ఇదే సినిమాని ‘తీన్‌మార్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ ఉన్నాయి. ‘ఏ రిలేషన్ వితౌట్ ఎనీ రిలేషన్‌షిప్’ అంటుంది హీరోయిన్ మధుమతి(భూమిక). 
సినిమాలు చూసి ఇన్‌సై్పర్ అయ్యే ఈ తరం.. దీన్నే ఇప్పుడు ట్రెండ్ అనుకుంటోంది. 
జరిగేదంతా మన మంచికే. ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.. అంటూ ఈజీగా కటీఫ్ చేప్పేస్తున్నారు.

lovers-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaమూడేళ్ల క్రితం గాళ్‌వూఫెండ్‌కి బ్రేకప్ చెప్పి రెండేళ్లు విడిపోయిన శ్రవణ్ ఇప్పుడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ‘‘మా ఇద్దరికీ చిన్న విషయంలో పడలేదు. జీవితాంతం ఇలాగే ఉండాలా? అనిపించింది. విడిపోదామనుకున్నాం. అదీ ఫ్రెండ్లీగా. ఏడాది గడిచింది. అప్పుడప్పుడూ కలుసుకున్నాం. కానీ అంతకు ముందు ఉన్న సాన్నిహిత్యం ఉండేది కాదు. మళ్లీ ప్రేమ చిగురించింది. ఇప్పుడు మా ప్రేమ చాలా స్ట్రాంగ్. పదో తరగతి నాలుగు సార్లు చదివినంత స్ట్రాంగ్’’ తన ప్లస్ వన్ లవ్‌స్టోరీ గురించి చెప్పాడు శ్రవణ్. 
‘‘సిద్ధూ నాకన్న టు ఇయర్స్ చిన్నవాడు. ఆ విషయం దాచిపెట్టాడు. కోపమొచ్చింది. కొట్టాలనిపించింది. తిట్లతో సరిపెట్టాను. ఇక లైఫ్‌లో ఎప్పటికీ నీ మొహం చూపించకు అన్నాను. విడిపోయాం. జస్ట్ కిట్ క్యాట్ బ్రేక్. ఇప్పుడు మేం మంచి ఫ్రెండ్స్’’ తన బ్రేక్ అప్ గురించి ఇలా చెప్పింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనన్య. 

ఒక రిలేషన్ షిప్‌ని బ్రేక్ చేయడమంటే ఈ జనరేషన్‌కి చాలా నార్మల్ థింగ్. ఒక ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగంలో చేరినట్లు.. అంగీ విప్పి.. టీషర్ట్ వేసుకున్నట్లు.. చాలా సింపుల్. 
పగిలిన హృదయం పద్మవ్యూహం. చేధించడం చాలా కష్టం. ప్రేమలోనో, స్నేహంలోనో మనస్పర్థలు రావడం సహజం. విడిపోవాలనుకోవడం సరే. కానీ దానికీ ఓ పద్ధతుండాలి కదా? ఎప్పుడు పడితే అప్పుడు. ఎక్కడంటే అక్కడ.. ఎలాగైతే అలా విడిపోతే.. అంతవరకూ ఉన్న బంధానికి అర్థమేంటి? అని ప్రశ్నిస్తే అదంతా వారికి నాన్సెన్స్. మనకే చాదస్తం అంటారు. క్లాస్ పీకుతున్నామని కామెంట్ చేస్తారు. 

girl-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

అంత మాటెందుకుపూండి అంటారా? అందుకే.. 

మనుషుల మధ్య మనస్పర్థలు వస్తే విడిపోండి-
అని నేను చెప్పడం లేదు. అలా చెప్పడం తప్పే. కాదనను. కానీ తప్పని సరి పరిస్థితుల్లో తప్పు చేయడంలో తప్పులేదు కదా. కష్టంగా కలిసుండడం కంటే ఇష్టంగా విడిపోవడం బెస్ట్ కదా. 
ఇప్పుడు

తెలంగాణ కోరుకుంటున్నదీ ఇదే. 
అన్నదమ్ముల్లా విడిపోదాం! ఆత్మీయుల్లా కలిసుందాం!!

ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా? 
ఎవ్రీ డాగ్ యాజ్ ఇట్స్ ఓన్ డే అన్నట్లు. ప్రతి వేడుకకీ ఒక రోజుంటుంది. బ్రేకప్ సెలెవూబేషన్‌కీ ఒక రోజుంది.. అదే జూన్ 2. అన్ని అంశాల్లాగే ఈ బ్రేకప్ కల్చర్ కూడా మనదేశానికి దిగుమతి అవుతోంది. అందుకే సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సంఖ్య పెరుగుతోంది. వారి కేసులూ వృద్ధి అవుతున్నాయి. దీనికి తోడు ఇంటర్‌నెట్‌లో కూడా ప్రత్యేక పోర్టల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లు ఎలా విడిపోవాలో చెబుతూనే.. విడిపోయాక ఎలా సరై్వవ్ కావాలో కూడా చెబుతున్నాయి. thebreakupsurvivor.com అనే వెబ్‌సైట్ ఎందుకు విడిపోవాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా విడిపోవాలి తదితర అంశాలపై సలహాలు ఇస్తోంది. విడిపోయిన తర్వాత ఎలా మనగల్గాలి, బ్రేకప్ లైన్స్, ఈ-బుక్స్‌ని సైట్‌లో పొందుపర్చింది.