Archive for ఆగస్ట్, 2009

తెలంగాణ చరిత్ర

telangana

భారత దేశానికి ప్రపంచం లో ఎంత చరిత్ర కలదో తెలంగాణ కు కూడా అంతే చరిత్ర కలదు. ఆ చరిత్ర ఏమిటంటే….. !

వివాహాది శుభ కార్యాలలో బ్రహ్మనోత్తములచే

“జంబూద్వీపే భరత ఖండే దక్షిణ పదే అస్మకం” అనే శ్లోకం వింటునే వుంటున్నాం ఈ అస్మక ప్రాంతమే తెలంగాణా ప్రాంతం .

కృత యుగం (వేదకాలం) లో జంబూద్వీపం నుండి హిమాలయాలకు వెళ్ళే ఋషులు ఆర్మూర్ లో ని నవ నాథుల సిద్ధుల గుట్ట వద్ద ,మునులు మొర్తాండ్ మండలం లో ని మునుల గుట్ట వద్ద విశ్రాంతి తీసుకొని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకునేవారు.ఇలాంటి ప్రాంతాలు తెలంగాణ లో కలవు.

త్రేతాయుగం లో ఈ ప్రాంతం దండకారణ్యం గా పిలువ బడేది. ఈ యుగం లో శ్రీ రాముడు ,సీతమ్మ,లక్ష్మణులసమేతంగా అయోధ్య నుండి త్రివేణి సంగమం నాకు వచ్చినారు.ఆనతి ఆ త్రివేణి సంగమమే నేటి రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామము. ఈ త్రివేణి సంగమ్మ తెలంగాణా లో వుండడం తెలంగాణా వారికెంతో పుణ్యఫలం . శ్రీరాముడు ,సీతమ్మ,లక్ష్మణులు గోదావరి నది తీరం వెంబడి వెళ్తు ఖమ్మంలోని భద్రాచలం లో కొలువైనారు. అదే కాలం లో రత్నాకరుడనే గజ దొంగ నారదుని చేత జ్ఞానోదయం పొంది వాల్మీకి గ మారి రామాయణ మహా కావ్యాన్ని రచించాడు .అతడు జ్ఞానోదయం పొందిన ప్రాంతమే నవీపేట్ మండలం లోని కస్పబినోల గ్రామము. నేటికి ఇచ్కాత వాల్మీకి సమాది కలదు.అతడు “కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషు లావు తారు” అనే వాక్యం నిజం చేసినారు. వాల్మీకి తెలంగాణా ప్రాంత వాసి కావడం ఈ ప్రాంత ప్రజల కెంతో గర్వ కారణం.

ద్వాపర యుగం లో పాండవులు హస్తినపురం (డిల్లీ) నుండి అజ్ఞాత వాసం లో దక్షిణ భారత ప్రాంత మైన అస్మకం చేరినారు. ఈ ప్రాంతం లో బకసూరుడనే రాక్షసుడు తిని,త్రాగి ప్రజలను హింసిస్తుండే వాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు చంపినాడు. ఆ నాటి ఆ ప్రాంతమే నేటి భోధన్ లోని రాకాసి పేట్. నేడు దీనిని భీముని గుట్ట అంటున్నారు. పాండవులు ఈ ప్రాంతం రావడం ఇక్కడి వారి అదృష్టం . ఇదే యుగం లో మహా భారత రచయిత వ్యాస మహర్షి కాశి నిండి తీర్ద యాత్రలు చేస్తూ అస్మకం ప్రాంతం చెంత గోదావరి తీర ప్రాంతమందు జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీ మాత ని ఆదిలాబాద్ లో ప్రతిస్తాపన చేసినారు. నాటి వ్యాసపురి ఐన వాసర క్షేత్రం నేడు బాసర గ ప్రసిద్ది చెందినది. వ్యాసుడు తెలంగాణా ప్రాంతం లో జ్ఞాన సరస్వతీని ప్రతిస్తాపన చేయడం తెలంగాణా ప్రజల కు మహా వరం లాంటిది.

క్రీ.పూర్వము 6వ శతాబ్దము గౌతమ బుద్దుని పరిపాలనలో అఖండ భారత షోడశామహజన పదా(౧౬ రాజ్యాలు) లతో ఆర్థిక రాజకీయ నైతిక మరియు సాంస్కృతిక రంగాలలో అత్యంత వైభవంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండేది . ఈ షోడశ మహా జన పదాలుగాంభోజ,గందార,కురు,మత్స్య,శూరుసేనా,

పాంచాల,కోసల,మల్ల,చెడి,వాత్స్య,కాశి,వజ్జీ,అంగ,మగధ, అంతి మరియు అస్మక ౧౬ జాణ పదాల లో ౧౫ ఉత్తర భారత దేశం లోఉంటే అందులో ఒకే జానపదం “అస్మక” దక్షిణ భారత దేశం లో గోదావరి కృష్ణ నదుల మద్య ఉండేది. ఈ ప్రాంతపు గొప్ప పరిపాలన గురించి గ్రీకు రాజి న అలెగ్జన్దర్ రాయబారి మొగస్తానీసు తనచే వ్యాయబడిన “ఇండికా” అనే గ్రంధం లో పేర్కొన్నారు. ఈ అస్మక ప్రాంతం అపారమైన జల వనరులు౯చఎరువులు) విస్తారమైన అటవీ సంపదతో నా తెలంగాణా కోటి రతనాల వీణా గా చరిత్రలో నిలిసినది. ఇతర దేశాలైన గ్రీకు,రోమ్,చైనా,మోసపోతేమియా,హిబ్రూ,జేరుసాలెం లాంటి ప్రపంచదేశాలతో స్నేహ సంభందాలు ఏర్పాటు చేసుకున్నది.

ఆసియా ఖండం లో నే అతిపెద్దధైన నిజాంషుగర్ ఫ్యాక్టరీ వ్యవసాయంలో అగ్రగామి గ ఉండేది . చారిత్రాత్మక కట్టడాల తో పాటు హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం మతాలతో భిన్నత్వం లో ఏకత్వంగా ఉండేది. భౌగోళిక పరంగా ఈ ప్రాంతం “దక్కన్’ ప్రాంతం గ వర్ణించబడింది.ఉర్దూ లో దక్కన్ అంతే మూట లేదా ఎత్తైన ప్రాంతం . నాటి నుంచి నేటి వరకు తెలంగాణా ప్రాంతంలో అనేక ఉర్దూ పదాలు (దావఖాన,సడక్,) అగుపడుతున్నవి. అలాంటి ఒక ఉర్దూ పదమే “లష్కర్” .లష్కర్ అంతే తెలుగు లో సైనిక స్థావరం,ఇంగ్లీష్ లో “కంటోన్మెంట్”

స్వాతంత్ర్యానికి పూర్వం యావత్ భారత దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తునతే ఆపారమైన వనరులున్న దక్కన్ ప్రాంతాన్ని నైజాం పరిపలిస్తుండే వాడు . దక్కన్ ప్రాంతాన్ని ఆంగ్లేయుల ఆదినం లో కి వెళ్ళకుండా నైజాం తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ ప్రాంతం గ ఏర్పాటు చేసినాడు.లష్కర్ అంటేనే సైనిక స్థావరం . ఈ సైన్యం లో ఉన్నా సైనికులు తమ విధి నిర్వహణలో నిర్భయంగా ఉండాలి . ఈ నిభాయత్వం సింహం లో అగుపడుతున్నది.సింహం మహంకాళి యొక్క వాహనం కావున సైన్యం లోని ప్రతీ సైనికుడు సింహం లాగ ఉండడానికి మహంకాళి ని పూజించారు. బోనం అంటే ఘటిక తో తయారు చేయబడిన ప్రసాదం. నాటి లష్కర్ సికింద్ర బాద్ లోని మహంకాళి కి బోనం పెట్టి లష్కర్ బోనాల పండుగ జరుపుకొని ఆంగ్లేయుల పాలనను అడ్డుకున్నారు.

స్వాతంత్ర్యమ అనంతరం ౧౯౫౫ లో యావత్తూ భారత దేశం లోని అగ్ర గామిగా ఉన్నా తెలంగాణా ప్రాంతం పై ఆంద్ర నాయకుల కన్ను పడింది. నాటి రాజకీయ నాయకులు అమాయకురాలైన అమ్మాయిని (తెలంగాణా) గడసరి అబ్బాయితో( ఆంధ్ర) తో పెళ్లి చేస్తున్నాను. కలిసి ఉంటేవున్దవచ్కూ లేదా విడిపోవచ్చు అంటు ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలను కలుపుతూ విశాలంద్రాగా మార్చినారు . ౧౯౫౬ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు లక్షల ఉద్యోగాలు కొల్పొఇ యువతీ యువకులు పెడదారి పడుతున్నారు .

నక్సలైట్లు గా మారుతున్నారు. ఉద్యో గాలు లే క బతుకు జీవుడా అంటూ. గల్ఫ్ ప్రాంతం వెళ్లి బానిస బతుకులు బతుకుతున్నారు . అన్నదాతలు గ ఉండవలసిన రైతన్నలు అప్పులు తీర్చలేక అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నా తెలంగాణా కోతి రతనాల వీణా గ వున్నా ఉన్నా ప్రాంతం లో నేడు నిత్యమ జరుగు తున్న చరిత్ర ఇది . అందుకే మనమందరం కుల, మాట రాజకీయాల కు అతీతం గా తెలంగాణా రాష్టం ఏర్పాటుకు కట్టుబడి తెలంగాణా రాష్ట్రాన్ని సాదించుకుందాం ..!

తెలంగాణ అగ్నిపుష్పం ఆరుట్ల కమలదేవి

telangana movement

telangana movement

తెలంగాణ పోరాటం లో వికసించిన అగ్నిపుష్పం డాక్టర్ ఆరుట్ల కమల దేవి మహిళా లోకానికి ఆదర్శనీయం. పుట్టింది పల్లేటూళ్ళో ఐన
భర్త ఆరుట్ల రామచంద్ర రేడ్డి ఆశయాలు ఆదర్శాలకు ప్రతిబింభంగా నిలిచి ప్రజల హృదయాల లో సుస్టిర స్తానాన్ని పొందారు.
జాగిర్దారీ,నైజాం కర్కషపాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే కదన రంగం లో సంఘం కట్టిన భర్తకు తోడుగా ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం తుపాకి నెత్తిన వీరవనిత కమలదేవి మత సామరస్యానికి స్త్రీ విద్య ను పెంపొందించడానికి ఆ రోజుల్లోనే కృషి చేసిన ఆమెలోని దయాగుణం ,చైతన్య మూర్తిత్వం కొనియాడదగింది.
వంటింటికి బానిసలుగా బ్రతుకుతున్న మహిళలకు వెన్ను దన్ను గా నిలిచి ఆలేరు నుంచి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి MLA గా వెళ్ళిన కమలాదేవి నిస్వార్దసేవా రాజకీయాలకు నిర్వచనం చెప్పిన మహొన్నత వ్యక్తి, తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రామచెంద్రా రెడ్డి దర్మ పత్నిగా ఆయన అడుగు జాడల్లొ నడిచి చరిత్ర లో నిలిచి పొిన మహిళమణి కమలాదేవి .
పోరాటాలఖిల్లా నల్లగోండ జిల్లా
ఆలేరు సమీపం లోని మంతపురి గ్రామం లో 1920 లో పల్లా లక్ష్మినర్సమ్మ-వెంకట్రామిరెడ్డి దంపతులకు జన్మించింన కమలాదేవి తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి. పదకొండు సంవత్సరాల వయస్సు లో కొలనుపాక కు చెందిన మేనబావ ఐన ఆరుట్ల రామచంద్ర రెడ్డి తో కమలాదేవి వివహం జరిగింది. స్వాతంత్ర్యోద్యమం దేశమంత ముమ్మరంగా సాగె రోజులు, జాతీయొద్యమ నాయకురాలు కమలదేవి చటోపాధ్యాయ స్పూర్తి తో ఆమె పేరును కమలాదేవి గా మర్చారు.
హైద్రాబాద్ లోని మాడపాటి హనుమంత రావు స్తాపించిన ఆంద్ర గర్ల్స్ హైస్కూల్ లో కమలాదేవి చదువుకొంది. ఈ సమయం లోనే హైద్రాబద్ లో బాలికల కోసం రెడ్డి హాస్టల్ ఎర్పాటైంది. చదువుకుంతున్న రోజులలోనే భర్త రామచంద్రా రెడ్డితొ కలిసి క్రియశీలక రాజకీయాల్లో పాల్గొంటుండే వారు. స్కూల్ ఫైనల్ పాసైన తర్వాత స్వగ్రామమైన కొలనుపాక వెళ్ళిన కమలదేవి గ్రామం లో జగీర్దారుకు వ్యతిరేకంగా నిషేదాన్ని ఉల్లంఘించి వంటశాల పేరుతో వయోజన విద్యాకేంద్రాన్ని, గ్రంథాలయాన్ని నడిపించడం లో క్రియశీలక పాత్ర పోషించారు.

చిలుకూరు లో జరిగిన10 వ ఆంద్రమహాసభలో కమలదేవి పాల్గోన్న తర్వాత రాజకీయల్లో చురుకైన పాత్ర పోషిస్తు వచ్చారు. భర్త రమచెంద్రా రెడ్డి వెంట కమలాదేవి ఆంద్ర మహాసభల సమవేశాలకు వెళ్ళెవారు. ఆంద్ర మహా సభ లో కమ్యినిస్టు పార్టి సబ్యత్వమ్ స్వీకరించిన కమలాదేవి రాజకీయ ,సైనిక శిక్షనలు పొందారు.క్రమ శిక్షన కల్గిన నాయకురాలి గా ఆనాడు పార్టీ నాయకు లైన రావి నారయణ రెడ్డి ,బద్దం ఎల్లారెడ్డి ,ముగ్దుం మొినొద్దీన్ ల వద్ద పేరు తెచ్చుకున్నారు. న్ల్లగోండ జిల్లాలో మర్షల్ లా విదించడంతో పురిటి బిడ్డని వదిలి ఉధ్యమమ్ కోసం భర్త తో కలిసి రహస్య జీవితమ్ లో కి వెళ్ళారు. సాయుధ పోరాటం లో భర్త తో పాటు పాల్గొన్న కమల దేవి చల్లూరు గుట్టల్లో చేసిన పోరాటం నేటికి గ్రామల్లో కథలు గ చెప్పుకుంటారు.

1948 లో జైలు కెళ్ళి విడుదలైన ఆరుట్ల కమలాదేవి 1952 లో ఆలేరు అసెంబ్లి నుంచి MLA గా ఎన్నికై 1967 వరకు ఆ పదవి లో కొనసాగారు. ప్రజభిమానం పెట్టని కోటవలే పెంచుకున్న కమలదేవి శాసన సభ లోమహిళా ప్రతిపక్ష నాయకు రాలిగా అందరి మన్ననలు పోందారు. దేశంనే ప్ర ప్రథమ ప్రతిపక్ష నాయకు ఉరాలి గా ఆమెకీర్తికెక్కారు.1955 కమ్యునిస్టు దేశాలైనా బల్గెరియా,జెకొస్లెవియా,ఆస్ట్రేలియాలు పర్యటించిన కమలదేవి 1983 లో రామచంద్రారెడ్డి తో కలసి సోవియట్ యూనియన్ వెళ్లారు 1973 లో ఆంద్రప్రదేశ్ మహిళ సమాఖ్య కార్యదర్శి గా పని చేసారు.65 సంత్సరాల సుదీర్గ క్రీయశీల రాజకీయ ప్రస్థానం లో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరొహించిన ఆమె స్వచ్చందంగా విశ్రమించి రాజకీయాలకు కొత్త వొరవడిని సృష్టించారు.

ప్రజసేవలే కర్తవ్యంగా విమిక్తి పోరాటం లో పాల్గొన్న వీరనారి కమలాదేవికి 1988 లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చెసింది. భారత స్వాతంత్ర్యా స్వర్ణోత్సవాల సందర్భం గా తెలంగాణ విమోచన స్వర్ణొత్సవాల సందర్భం గా సత్కారాలు జరిగాయ్ . జీవన ప్రయాణం లో అలిసిపోిన కమలాదేవి 2001 జనవరి 1వ తేదిన తుదిశ్వాస విడిచారు.
బ్రతికి చచ్చియు
ప్రజలకెవ్వరు
ప్రీతి గూర్చునో
వారె ధన్యులు
అన్న గురజాడ మాటలను సార్ధకం చేస్తూ తిరిగిరాని లోకాలకి వెళ్ళి పోింది ఈ తెలంగాణ అగ్ని పుష్పం.
ఆరుట్ల కమలా దేవి పోరట స్పూర్తి తో తెలంగాణ పోరాట యొదులవుదాం

జై తెలంగాణ!
జై జై తెలంగాణా!!