తెలంగాణ నా జన్మహక్కు – సభలో గర్జించిన సర్వే


– తెలంగాణ ఒక ప్రత్యేక దేశం కూడా

– సీమాంవూధులు ఆనాడు మద్రాస్ అన్నారు
– ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు
– హైదరాబాద్ తెలంగాణకు తలలాంటిది
– మొండెం నుంచి తలను వేరు చేయొద్దు
– కాలయాపన చర్చలొద్దు
– పార్లమెంటులో నిర్ణయిస్తే చాలు
– వెంటనే రాష్ట్రం ప్రకటించాలి
– అడ్డుతగులుతూ అనవసర వ్యాఖ్యలు
– నైజం చాటుకున్న సీమాంధ్ర ఎంపీలు
Hanu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, ఆగస్టు 5 (టీ న్యూస్): తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా తెలంగాణ ఎంపీ సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి) ప్రసంగం ఆయన మాటల్లో..

నాకు రాజకీయ జన్మనిచ్చిన సోనియాగాంధీ ఇక్కడ ఉంటే తెలంగాణ ఇచ్చి ఉండేవారు. అనారోగ్యంతో ఉన్న ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రజల తరుపున దేవున్ని ప్రార్థిస్తున్నా. సుష్మాస్వరాజ్ అన్నట్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగానే గాక ప్రత్యేక దేశంగా ఉండేది. తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుమీద మద్రాసు నుంచి విడిపోయిన సీమాంవూధతో కలిపారు. అప్పుడు మద్రాసు గురించి మాట్లాడిన సీమాంవూధులు ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ మాటకు అనుగుణంగానే అవసరం అనుకున్నప్పుడు సీమాంవూధతో విడాకులు తీసుకుంటాం. కాంగ్రెస్ నాయకురాలు సోనియా తెలంగాణపై కొనసాగుతున్న వివక్షను అర్థం చేసుకున్నందునే తెలంగాణ ఇస్తుందనే విషయం తెలుసు. తెలంగాణ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ అందరూ నివసించవచ్చు. కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రావాలా భాగో అనే నైజం మాది కాదు. చిన్న రాష్ట్రాలే వేగవంతంగా ప్రగతిని సాధిస్తాయి. (తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు అని సీమాంధ్ర నాయకులు కామెంట్ చేయగా..) యాదిడ్డిలాంటి పిల్లలు బలిదానాలు చేసుకోవద్దనే తెలంగాణకోసం కాంగ్రెస్ సభ్యులుగా ఆత్మహత్య చేసుకుంటామన్నాం. మా ప్రజలను చావనియ్యం. బాలగాంగాధర్ తిలక్ స్ఫూర్తిగా తెలంగాణ మా జన్మహక్కు. రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించండి. పసంగాన్ని తొందరగా ముగించాలని స్పీకర్ కోరగా) తెలంగాణ ప్రజలు చస్తున్నారు.. సుష్మాలాగా సీనియర్ కాకపోయినా తోటి సహచరులు రాజీనామా చేసినందున మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి.

ఉద్యోగుల సమ్మె, టీ మంత్రుల రాజీనామాలతో రాష్ర్టంలో పాలన అస్తవ్యస్థమైంది. (మరి మీరు రాజీనామా చేయలేదేం అన్న మాటలపై) నేను, అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామాచేస్తే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతారని రాజీనామా చేయలేదు. నాయకురాలిని ధిక్కరించను. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన (తెలంగాణ) కానుకను వెనక్కు తీసుకోరు. కొందరు ఆటంకాలు కల్పించి తెలంగాణను అడ్డుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. అది ఎవ్వరి జాగీరు కాదు. హైదరాబాద్ తెలంగాణకు తల లాంటిది. మొండెం నుంచి తలను వేరు చేయొద్దు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి. విభజన, సమైక్యత అన్న రెండే రెండు అంశాల మీద నివేదించాల్సిన శ్రీ కృష్ణ కమిటీ ఇదంతా చెప్పడం అనవసరం.

అది రాజకీయ రిపోర్టు. ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లతో తెలంగాణకు న్యాయం జరగదు.. తెలంగాణ ఏర్పాటుతోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవతుంది. నిర్దిష్ట కాలపరిమితి లేకుండా చర్చలు చేయడం అనవసరం. తెలంగాణ విషయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. యూపీని విభజించడానికి రెండో ఎస్సార్సీ అని అధిష్టానం అంటుంటే సీమాంవూధులు తెలంగాణకు కూడా అదే సూత్రంతో లింకు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డా సీమాంవూధులు అడ్డుకోవటంవల్లే తెలంగాణ రాలేదు. తెలంగాణను తాత్సారం చేస్తున్నందునే పిల్లలు మరణిస్తున్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి వీడాలి.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

 1. at last we got it…jai telangana
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

  స్పందించండి

 2. there is no use with ur rowing on PARLAMENt
  what are you saying we r give TELANGANA
  than where going that words?

  must we need ur’s resignataion

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: