నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,
నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

పారేటి నీల్లల్ల పానాదులల్ల

పూసేటి పూవుల్ల పూనాసలల్లా

| పారేటి…|
కొంగు సాపిననేల నా తెలంగాణా, నా తెలంగాణా
పాలుతాపిన తల్లి నా తెలంగాణా, నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

తంగేడు పువ్వుల్లు తంబాలమంతా

తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు

| తంగేడు …|

తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు
బంగారు చీరలు బాజారులన్ని

|| బంగారు… ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా, నా తెలంగాణా
బంతి పూల తోట నా తెలంగాణా, నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

వరద గూడు కడితె వానొచ్చునంటా

బురద పొలము దున్ని మురిసున్నరంతా

| వరద … |

శివుని గుల్లే నీల్లు చీమలకు శెక్కరి

వానకొరకు భజన జడకొప్పులేసి

|| వాన … ||
వాగుల్ల వంకల్ల నా తెలంగాణా, నా తెలంగాణా
సూపు రాలిన కండ్లు నా తెలంగాణా, నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు

పాలపిట్టలజూసి పడుసుసప్పట్లు

| కొత్త … |

పాలపిట్టలజూసి పడుసుసప్పట్లు
జొన్నకర్రల జండ జోరున్నదేమి

||జొన్న … ||

అలై బాలై తీసె నా తెలంగాణా, నా తెలంగాణా
జమ్మి పంచిన ఆర్తి నా తెలంగాణా, నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

మోటగొట్టే రాత్రి మోగిన పాట

తాడుబేనిన తండ్రి తలుపులున్నప్పు

| మోట … |

తాడుబేనిన తండ్రి తలుపులున్నప్పు
కల్ల ముడిసిన అవ్వ కలలోని గింజా

|| కల్ల … ||

ఆరుగాలం చెమట నా తెలంగాణా, నా తెలంగాణా
ఆకలి దప్పుల మంట నా తెలంగాణా , నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

ఊరుగాచే తల్లి ఉరిమీజూడంగా

బువ్వలేని తల్లి బోనమొండిందీ

| ఊరుగాచే … |

బువ్వలేని తల్లి బోనమొండిందీ
సేనుకొచ్చిన పురుగు సెరిగిపోసిందా

|| సేను … ||

బోనాల పండుగ నా తెలంగాణా, నా తెలంగాణా
కాట్రావుల ఆట నా తెలంగాణా , నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

దట్టి గట్టిన రోజు డప్పు సప్పుల్లు

పీరీల గుండంల పిలగాండ్ల ఆట

| దట్టి … |

పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుక పేర్లమొక్కు కూలి బత్కుల్లు

|| కుడుక … ||

ఆలువాడిన పాట నా తెలంగాణా, నా తెలంగాణా
ఆత్మ గల్లా చెయ్యి నా తెలంగాణా , నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

కలిసేటి సేతుల్ల కన్నీటి పాట

సిందోల్లసిందుల్ల సిగురించే నాట్యం

| కలిసేటి … |
సిందోల్లసిందుల్ల సిగురించే నాట్యం
ఒగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం

|| ఒగ్గు … ||

కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణా
పాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

తాడుబేనిన బతుకుతండ్లాటసూడు

మంటలేని కొలిమి బతుకుల్ల మంట

| తాడు … |

మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్ళులేని చెరువు నినుజూసి నవ్వే

|| నీళ్ళు … ||

బతికిసెడ్డాబిడ్డ నా తెలంగాణా, నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి నా తెలంగాణా , నా తెలంగాణా

| నాగేటి సాల్లల్ల… |

బురుజుగోడల పొగరు మెడలు వంచంగా

పుట్లల్ల సెట్లల్ల గోగుపువ్వుల్లూ

| బురుజు … |
సద్దిమోసిన తల్లీ సావుబతుకులు

పానమిచ్చిన వీరకథలు పాడంగా

|| పాన … ||

గోరుకొయ్యల పొద్దు నా తెలంగాణా, నా తెలంగాణా
గోరింకలా సభలు నా తెలంగాణా , నా తెలంగాణా

|| నాగేటి సాల్లల్ల… ||

(ఈ పాటను మీరు ఇక్కడ ఇక్కడ వినవచ్చు …)

“నాగేటి సాల్లల్ల నా తెలంగాణా” పై ఒక అభిప్రాయం

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

  1. are.chandu manchi ga wrshaavu ra…………………….laani call chey ok

    స్పందించండి

  2. Posted by engineerchandu on నవంబర్ J, 2007 at 05:50

    thi is very intrested and ery satisfa cteed

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: