సెప్టెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ -టీఎంసీసీ చైర్మన్ కొండా లక్ష్మణ్ బాపూజీ

సెప్టెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ -టీఎంసీసీ చైర్మన్ కొండా లక్ష్మణ్ బాపూజీ

konda-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

హైదరాబాద్, ఆగస్టు 21:ఆంధ్రవూపదేశ్‌లో హైదరాబాద్‌ను విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ‘తెలంగాణ అసెంబ్లీ’ నిర్వహించనున్నట్లు స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమన్వయ కమిటీ (టీఎంసీసీ) చైర్మన్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో కేశవరావ్‌జాదవ్, విశ్వేశ్వరరావు, దిలీప్‌కుమార్, కేశవులు, రియాజ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో నిశ్శబ్దంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సెప్టెంబరు 17న తెలంగాణ అసెంబ్లీ నిర్వహించి తీరుతామని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వైఖరి తెలంగాణపై ఏ విధంగా ఉంటుందనేది స్పష్టమవుతుందని అన్నారు. 

ఇప్పటివరకు తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌లు, రాస్తారోకోల వల్ల నష్టపోయింది తెలంగాణ విద్యార్థులు, ప్రజలేనని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు విద్యార్థులను రెచ్చగొట్టడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాజకీయపార్టీలతో ఏర్పాటైన తెలంగాణ జేఏసీకి కూడా పారదర్శకత లేదని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే మాదిరిగా మీరు కూడా తెలంగాణ సాధించేందుకు దీక్షకు దిగుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు- ‘‘సచ్చి తెలంగాణ సాధించదలుచుకోలేదు.. బతికే సాధించాలనుకుంటున్నాను’’ అని బదులిచ్చారు. 

ఇకనుంచి టీఎంసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్షికమాలు సీమాంధ్ర పెట్టుబడిదారులకు నష్టం వాటిల్లే విధంగానే ఉంటాయని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

వచ్చే నెల

5, 6, 7 తేదీల్లో శాంతియుతంగా నిశబ్ద ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.

9, 10, 11 తేదీల్లో ఢిల్లీకి వెళ్లే రైళ్లన్నింటిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

12, 13, 14 తేదీల్లో శంషాబాద్ విమానాక్షిశయం ముందు ధర్నా నిర్వహిస్తామని, ఢిల్లీ వెళ్లే విమానాలన్నింటినీ అడ్డుకుంటామని చెప్పారు.

తెలంగాణవాదం ఎంత బలంగా ఉన్నదనేది ఢిల్లీకి వినిపించే విధంగా ఉద్యమం నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చిత్తశుద్ధితో పని చేసేందుకు నడుం బిగించామని చెప్పారు. సుమారు 12 డివిజన్లలో 30 కమిటీలకుపైగా ఎంపిక చేశామని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇటీవల తాను సమైక్యవాదులతో తెలంగాణ విషయంలో సంప్రదింపులు జరిపానని, కొందరు దానిని వక్రీకరించి దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు. 

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.