‘జిందగీ న మిలేగీ దొబారా’

‘జిందగీ న మిలేగీ దొబారా’
ఇది మూడు గంటల సినిమా కాదు. ఆరు దశాబ్దాలుగా ఒడవని తండ్లాట. పోరాట ఒరవడి. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్‌చారిని ఆదర్శంగా తీసుకుంటూ, ఏ తల్లికీ పుత్రశోకం కల్గించొద్దంటూ మాధురి, పావనిలు చేస్తున్న ‘బైక్ యాత్ర’ కు పాఠకులందరి తరఫునా ‘బతుకమ్మ’ వందనాలు.

‘జిందగీ నా మిలేగీ దొబారా’ సినిమా ప్రచారం కోసం కత్రినా కైఫ్ బైక్‌ను వీథుల్లో నడిపింది. జనాలు చూడడానికి ఎగబడ్డారు. ఇది కేవలం మూడు గంటల సినిమా కోసం. మరి తరతరాలుగా దగా పడుతున్న తెలంగాణ కోసం ఇద్దరు అక్కాచెప్లూళ్లు బైక్‌పై తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కేవలం వీరిని చూడడానికే రాలేదు జనం. వారి ఆకాంక్షను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చారు.

ఉన్నత చదువులు చదివిన ఈ అక్కా చెప్లూళ్లు తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుతామని పోరుబాట పట్టారు. ‘ఆత్మబలిదానాల కన్నా ప్రజల చైతన్యమే మిన్న’ అని మోటార్ సైకిల్‌పై పల్లె పల్లె తిరుగుతూ తెలంగాణ ఏర్పాటు అవసరం గురించి ప్రచారం చేస్తున్నరు. ఆ అక్క పేరు మాధురి. చెల్లె పేరు పావని.
వీరిది యాదగిరిగుట్టకు పది కిలోమీటర్ల దూరంలోని చల్లూరు అనే గ్రామం. మాధురి ఎంఎస్‌సీ బీఎడ్ చేసి, ప్రస్తుతం యాదగిరిగుట్టలోని ‘శ్రీ లక్ష్మీ నరసింహస్వామి’ జూనియర్ కళాశాలలో ప్రయివేటు లెక్చరర్‌గా పనిచేస్తోంది. పావని ఎంబీఎ చేసి, ప్రస్తుతం బ్యాంకులో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నది.

‘తెలంగాణ పోరాటం వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం ఏంది?’ అంటే ‘శ్రీకాంతాచారి’ అన్నరు వీళ్లు. అవును అది మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన సందర్భం. ‘‘ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డు దగ్గర శ్రీకాంత్‌చారి పెట్రోల్ పోసుకొని ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ ఆత్మార్పణ చేసుకున్నడు. అది చూసి చలించిపోయాం. అప్పటి వరకు చదువులపైనే మా ధ్యాసంతా. ఇక అప్పట్నించి తెలంగాణ ఉద్యమం వైపుకు మనసు పెట్టినం. శ్రీకాంతన్న మాదిరిగా కాల్చుకొని ఆత్మ బలిదానం చేయడం కాదు, బతికుండి తెలంగాణ సాధించుకోవాలనుకున్నాం’’ అని అన్నరు.

‘ఆడపిల్లలను ఒంటరిగా బయటికి పంపడానికి భయపడే ఈ రోజుల్లో మీరు ఇంత ధైర్యంగా బయటికి వచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారు?’ అని అడిగితే, మాధురి ఇట్లన్నది. ‘‘మాకు అన్నదమ్ములు లేరు. మేము నలుగురం ఆడపిల్లలం. ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. మమ్మల్ని మా తల్లిదంవూడులు గారాబంగా పెంచారు. మా నాన్న పేరు కస్తూరి మహేందర్. ప్రయివేటు మెకానిక్. అమ్మ ఉమాదేవి గృహిణి. మా నాన్న నాకు బైక్ డ్రైవింగ్ నేర్పించారు. నాకు డ్రైవింగ్ రావడంతో తెలంగాణ కోసం బైక్ పై తిరుగుతూ ప్రజలను చైతన్యపరచాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయం నేను, చెల్లెలు కలిసి నాన్నకు చెప్పినం. ‘ఆడబిడ్డలైన మీకింత ధైర్యం ఉన్నప్పుడు తెలంగాణ విముక్తి కోసం నేను కాదనేది లేదు బిడ్డా. నేను కూడా మీకు అవసరమున్న ఊళ్లళ్లకు వస్త’ అన్నడు. దాంతో మాకు ధైర్యం వచ్చింది’’ అని చెప్పారు.

‘‘మొదట సురేష్ అనే వ్యక్తి దగ్గర బైక్‌ను తీసుకొని, 2009 డిసెంబర్‌లో సొంత ఊరు చల్లూరు నుండి ప్రచారం మొదలు పెట్టినం. తర్వాత నాన్న బైక్‌ను వాడుకున్నం. రాజాపేట మండలంలోని అన్ని గ్రామాలు తిరిగి యాదగిరిగుట్ట బాటపట్టినం. పొట్టిమర్రి నుంచి యాదగిరిగుట్టకు ప్రచార యాత్ర నిర్వహిస్తుంటే, యాదగిరిగుట్ట జేఏసీ నుంచి అపూర్వ ఆదరణ లభించింది. మా పర్యటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ మా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండ్రు’’ అని తమ పర్యటన అనుభవాల్ని వారు పంచుకున్నరు.

వారింకా ఇలా వివరించారు. ‘‘బైక్‌పై మేం వెళ్లే గ్రామాలకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో ఎక్కడికక్కడ మేము చెప్పే మాటలకు ఆదరణ లభించింది. ‘బైక్‌మీద పల్లెటూర్లకు ఆడపిల్లలిద్దరు వస్తున్నరు’ అనగానే వందలమంది గుమిగూడే వారు. ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ, ఉన్నత చదువులు చదివే విద్యార్థులు మేం చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటున్నరు. వారందరితో ‘ఆత్మహత్యలు వద్దు… తెలంగాణ ముద్దు’ అని వివరంగా చెప్తున్నాం. దీనికి ముఖ్యంగా విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది’’ అని అన్నరు.

సొంతూరు చల్లూరులో మొదలైన వీరి ప్రచారం ఆలేరు నియోజక వర్గంలోని రాజాపేట,యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి మండలాలలోని అన్ని గ్రామాలకూ చేరింది. ‘తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతనాయకులు చేసిన, చేస్తున్న అన్యాయాలను, విద్య, ఉద్యోగాలలో జరుగుతున్న వివక్షను కరపవూతాల ద్వారా పంపిణి చేస్తున్నారు. ‘ఉద్యమం ఎలా కొనసాగించాలి, అందులో విద్యార్థులు, మహిళలు ఎలా ముందుండాలి?’ వంటి విషయాలను కూడా ఈ సోదరీమణులు ప్రజలకు వివరిస్తున్న తీరు గ్రామీణులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలె. వీరికి కొన్ని బెదిరింపు ఫోన్లు కూడా వచ్చినయట. వాటి గురించి అడిగితే ‘‘గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి ‘ఆడపోరీలు మీరేం జేస్తరు. బైక్‌పై తిరిగి ప్రచారం చేస్తే తెలంగాణ వస్తదా? మీ తిరుగుడు ఆపండి’ అని బెదిరించే వారు. వీటిని మేం లెక్కచేయక నాన్న అండతో ముందుకు పోతున్నం’’ అని చెప్పినరు.

‘‘శ్రీకాంతన్న మాదిరిగా కాల్చుకొని ఆత్మబలిదానం చేయడం కాదు, బతికుండి తెలంగాణ సాధించుకోవాలనుకున్నాం’’ అని వారన్నరు.

-ఫొటో, వ్యాసం : గొట్టిపర్తి భాస్కర్
టీన్యూస్, యాదగిరిగుట్ట

ఉధ్యమ కవిత- నమస్తే తెలంగాణ లో

తెలంగాణ కోసం రాజీనామాలు చేయిండ్రి లేదా అమరవీరుల ఆత్మలకు శాంతి కాక మిమ్మల్ని వెంబడిస్తయి…

ఒక మనిషిని నిలదీస్తున్నరి 29 మండి ఎమ్మెల్యేలు రాజీనామాలు ఇద్దరు మంత్రులు రాజీనామాలు  ఇది ఒక మనిషికి కొన్ని కోట్లమంది ఓట్లతో ఎన్నికైనా ప్రజస్వామిక వాదులు తెలియజేసే నిరసన అది కూడా ఉన్న ఆస్థుల గూర్చి ఆరా   తీస్థున్నారన్న సాకు అంటే అవినీతీ లేదు ఎమిలేదు ఇదంతా నాటకం అని నిరసన…

                                       అయ్యా తెలంగాణ ఎమ్మేల్యేలు, ఎంపీ లు మీరు న్యాయమైన తెలంగాణ డిమాండ్ సుమారు నాలుగున్నర కోట్ల ప్రజలు కొన్ని శతబ్ధాలుగ గోసలు పడుకుంటూ కాలం ఎళ్ళబోస్తున్నం అని ధీనంగా మిమ్మల్ని వేడుకుంటూ ఎందరో అమరవీరుల ఆత్మలను బలిదానలు చేస్తూ మీ ముందు రోదిస్తుంటే మీ కండ్లపడుతలేదా? తెలంగాణ ప్రజలేకదా మొన్న  మీకి పదవులు ఇచ్చింది. మరీ రేపు రాజీనామాలు చేస్తే
మళ్ళి గా జనాలే కదా మీకు ఓట్లు వేయవలసినది మరీ మీ ఆలోచనలు ఎటువొతున్నై…కొంచమన్న కనికరం మీకు లేదా?  తెలంగాణ ప్రజా యుద్ధంలో ఎనకటినుండి మోసపోగొడుతున్నది మీలాంటి నాయకులే
ప్రజలెన్నడూ ఎనకకూ వొలే , అసలు ఏలేటోళ్ళు మంచోళ్ళయితే తెలంగాణ కు గీ గోసలెందుకుండేవి? ఏలేటోళ్ళయిన మీరు నీళ్ళు మలుపుకపోతుంటే, ఉధ్యోగాలు పోతొంటే, తెలంగాణ బ్రతుకు చిద్రమైపోతుంటే మీరు గమ్మున కుసోవట్టే నేడూ మాకు గియ్యాల గిటువంటీ గోసలు మీరు కేవలం రాజీనామాలు చేస్తే తెలంగాణ వొస్తదనీ తెలంగాణ యావత్ ప్రజానికం భావిస్తున్నతరుణంలో మీరు రాజీనామాలు అని అంటే మా మదులన్ని పులకరించిపోయే కాని తిరిగి చర్చలని లోపలలోపల ఎమేమో అనుకును మల్ల విధులల్లకు పోబడితిరి…

గిప్పుడు మమ్మలని అమరవీరుల ఆత్మలు అడుగుతున్నవి అరే నేను స్వర్గం ద్వారం తెరచుకోకముందే తెలంగాణ రాష్ట్రం వొస్తదనీ నా తెలంగాణ బిడ్డల సంతోషాలు చూసి స్వర్గం లోకి అడుగు బెడతాననుకుంటే గిట్లయ్యిందేంటని  తెలంగాణ సిద్ధించాకే మేము స్వర్గంలోకి పోతామని అంతదాక తెలంగాణ ద్రోహూల పనిబడతామని శపథం చేస్థున్నాయి.. ఇకనైనా  తెలంగాణ కోసం రాజీనామాలు చేయిండ్రి లేదా అమరవీరుల ఆత్మలకు శాంతి కాక మిమ్మల్ని వెంబడిస్తయి…

                                                                              – నల్ల చంద్ర స్వామి మాదిగ

సెప్టెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ -టీఎంసీసీ చైర్మన్ కొండా లక్ష్మణ్ బాపూజీ

సెప్టెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ -టీఎంసీసీ చైర్మన్ కొండా లక్ష్మణ్ బాపూజీ

konda-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

హైదరాబాద్, ఆగస్టు 21:ఆంధ్రవూపదేశ్‌లో హైదరాబాద్‌ను విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ‘తెలంగాణ అసెంబ్లీ’ నిర్వహించనున్నట్లు స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమన్వయ కమిటీ (టీఎంసీసీ) చైర్మన్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో కేశవరావ్‌జాదవ్, విశ్వేశ్వరరావు, దిలీప్‌కుమార్, కేశవులు, రియాజ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో నిశ్శబ్దంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సెప్టెంబరు 17న తెలంగాణ అసెంబ్లీ నిర్వహించి తీరుతామని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వైఖరి తెలంగాణపై ఏ విధంగా ఉంటుందనేది స్పష్టమవుతుందని అన్నారు. 

ఇప్పటివరకు తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌లు, రాస్తారోకోల వల్ల నష్టపోయింది తెలంగాణ విద్యార్థులు, ప్రజలేనని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు విద్యార్థులను రెచ్చగొట్టడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాజకీయపార్టీలతో ఏర్పాటైన తెలంగాణ జేఏసీకి కూడా పారదర్శకత లేదని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే మాదిరిగా మీరు కూడా తెలంగాణ సాధించేందుకు దీక్షకు దిగుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు- ‘‘సచ్చి తెలంగాణ సాధించదలుచుకోలేదు.. బతికే సాధించాలనుకుంటున్నాను’’ అని బదులిచ్చారు. 

ఇకనుంచి టీఎంసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్షికమాలు సీమాంధ్ర పెట్టుబడిదారులకు నష్టం వాటిల్లే విధంగానే ఉంటాయని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

వచ్చే నెల

5, 6, 7 తేదీల్లో శాంతియుతంగా నిశబ్ద ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.

9, 10, 11 తేదీల్లో ఢిల్లీకి వెళ్లే రైళ్లన్నింటిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

12, 13, 14 తేదీల్లో శంషాబాద్ విమానాక్షిశయం ముందు ధర్నా నిర్వహిస్తామని, ఢిల్లీ వెళ్లే విమానాలన్నింటినీ అడ్డుకుంటామని చెప్పారు.

తెలంగాణవాదం ఎంత బలంగా ఉన్నదనేది ఢిల్లీకి వినిపించే విధంగా ఉద్యమం నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చిత్తశుద్ధితో పని చేసేందుకు నడుం బిగించామని చెప్పారు. సుమారు 12 డివిజన్లలో 30 కమిటీలకుపైగా ఎంపిక చేశామని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇటీవల తాను సమైక్యవాదులతో తెలంగాణ విషయంలో సంప్రదింపులు జరిపానని, కొందరు దానిని వక్రీకరించి దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు. 

బలిదానాలొద్దు..బతికి సాధిద్దాం

susma-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema 

రంది పడాల్సిన సమయం కాదిది… రణం చేయాల్సిన తరుణం!

తెలంగాణ సాధనకు చోదక శక్తి బేలతనపు చావు కాదు. ఎంతమావూతమూ ఆ అవసరం లేదు. కావలసింది తెగించి చేసే ధీరోదాత్త పోరాటమే! ఈ మహత్తర పోరాటంలో పరాక్షికమ సమరవీరులు మీరు! అగ్రగామి దళాలు మీరు! నెత్తురు మండే శక్తులు నిండే ముందు యుగం దూతలు మీరు! మీరు లేనిదే ఉద్యమం లేదు.. మీరు లేనిదే ఉద్యమం ఉండదు! మీరు లేనిదే తెలంగాణ పోరు లేదు! మీ పోరు లేనిదే ఉజ్వల భావి తెలంగాణ ఊహించనేలేము! తెలంగాణ కోసం ఈ పోరాటం. దగా పడిన తెలంగాణ యాచక స్థాయి నుంచి శాసక స్థాయికి ఎదిగేందుకే ఈ ఆరాటం! ‘ఎట్లొస్తది తెలంగాణ’ అన్నకాణ్నుంచి ‘ఎట్లెట్లరాదు తెలంగాణ’ అని బరిగీసి నిలిచే కాలం ఇది! నాలుగు కోట్ల ఆకాంక్షలు ఓ వైపు.. గుప్పెడు మంది స్వార్థపర శక్తులు మరోవైపు! వాళ్లూ దిక్కుతోచని స్థితికి రాక తప్పదు. అబద్ధాలు పటాపంచలవుతున్నాయి. తెలంగాణను అడ్డుకుంటున్న కపట సమైక్యవాదపు ఆర్థిక ప్రయోజన ముసుగులు తొలగిపోతున్నాయి. వారి వద్ద ఇప్పుడు పటిష్టమైన వాదనలు లేవు.. పేలవమైన అడ్డగోలు వాదనలే ఉన్నాయి. గట్టి కారణాలులేవు.. ఓటి మోతలే వారి వద్ద మిగిలాయి. మొన్నటికి మొన్న లోక్‌సభలో మూగబోయిన సమైక్యవాదమే ఇందుకు సాక్షి. చెప్పేందుకు మాటల్లేక.. వాదనతో కాక.. బలవంతంగా నోరు మూయించేందుకు సీమాంవూధనేతలు తెగబడటమే ప్రతీక! అవును… శత్రువు ఓడిపోతున్న తరుణమిది! మహత్తర తెలంగాణ ఉద్యమ చైతన్యం ముందు క్రమక్షికమంగా మోకరిల్లుతున్న సమయమిది! వారిది ఆరిపోయే ముందటి వెలుగు! ఉదయమెంతో లేదు దూరము.. తొలగిపోవునంధకారము..!! కలత వద్దు.. విజయం మనదే! ఈ దశలో మరణం అస్త్రసన్యాసమే! ఈ దశలో అస్త్ర సన్యాసం ఓటమిని ఒప్పుకోవడమే! ఈ దశలో ఓటమిని ఒప్పుకోవడం తెలంగాణను ఒద్దనుకోవడమే! వద్దు.. ఓటమిని ఒప్పుకోవద్దు. పోరు దారి పూల బాట కాదు.. కష్టాల్ నష్టాల్ శాపాల్ రానీ.. ఎదుర్కొందాం. తిప్పి కొడదాం. నిజమే బలిదానం శంకించదగింది కాదు. పైగా వెల లేనిదే! కానీ.. బతికుండి చేసే పోరాటం మరింత విలువైనది.. వ్యక్తిని శక్తిని చేసేది! బలిదాన స్ఫూర్తి తెలంగాణకు కొదవలేదు. 600 మందికి పైగా అమరవీరులు ఉద్యమాన్ని నిత్యజ్వలితం చేస్తున్నారు! ఆ సెగల పొగలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ.. ఆత్మత్యాగం కానే కాదు మార్గం. వీధుల్లో పోరాటాలు నడుస్తున్నాయి. అదే మనదారి. ఇక చావులు వద్దు. ఎవరూ చావొద్దు. ఇప్పుడు ఉద్యమానికి కావాల్సింది ఆత్మహత్యలు కాదు.. ఆత్మబలంతో కొట్లాడే సైన్యం! మీరు చనిపోవడం కాదు.. తెలంగాణలో ఉద్యమం చనిపోకుండా చూడండి! ప్రాణాలు వదలొద్దు.. పోరాటం వదలొద్దు. భావితరం దూతలు. ప్రపంచాన్ని నవ యవ్వన తేజంతో వెలిగించే దివ్వెలు మీరే. తెలంగాణ మీ కోసమే. నెత్తురు మండే శక్తులు నిండే మీలాంటి వాళ్లకోసమే. తెలంగాణ మీది. సాధించాల్సింది తెలంగాణను. కలెబడుదాం. కొట్లాడుదాం. మన వెంట న్యాయం ధర్మం, రాజ్యాంగ బలం ఉన్నాయి. నీతి నియమాలు, విలువలు తెలంగాణ ఉద్యమంతో ఉన్నాయి. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. తెలంగాణ రాక తప్పదు. ప్రపంచంలో ఏ శక్తీ దాన్ని నిలువరించలేదు. పోరాడుదాం.. పోరాడుదాం.. తెలంగాణ వచ్చేదాకా.. బతికి సాధిద్దాం…. …. యావత్ తెలంగాణ యువ సైన్యానికి నమస్తే తెలంగాణ చేతుపూత్తి చేస్తున్న విజ్ఞప్తి ఇది! బలిదానాలు వద్దు. పోరాడి తెలంగాణ తెచ్చుకుందాం. ‘‘తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా నాకు సోదర సమానమైన యువతను నేను వేడుకొంటున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోవద్దు. తెలంగాణ ఆకాంక్ష సాకారమయ్యేరోజును చూడటానికి బతికి ఉండండి. ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి నష్టం చేయకండి. మరొక్క ఆత్మహత్య జరిగినా.. నేను తెలంగాణ ఉద్యమం నుంచి ఉపసంహరించుకుంటాను’’ –              

 

                                                                                           ట్విటర్‌లో సుష్మాస్వరాజ్ సందేశం

మా సార్ తెలంగాణ పాట- నమస్తేతెలంగాణ లో

లోక్సభలో తెలంగాణ ధూమ్ ధామ్

సావధాన తీర్మానంపై వాడివేడి చర్చ

హోరెత్తిపోయిన లోక్‌సభ.. చర్చకు సీమాంధ్ర ఎంపీల అడ్డు
అమరత్వాన్నీ చులకన చేసే ప్రయత్నం.. బుద్ధి చాటుకున్న వ్యతిరేకులు

– ఫలించిన బీజేపీ వ్యూహం
– ఇరకాటంలో అధికారపక్షం
– పార్టీ సభ్యత్వానికీ రాజీనామాలు!
– కాంగ్రెస్ నేతలపై పెరగనున్న ఒత్తిడి?

సోదర సోదరీమణులారా..
తెలంగాణ కోసం బలిదానాలొద్దు.. తెలంగాణ చూడటానికి
బతికుండాలి.. బతికుండాలి..
బతికుండాలి..

– సుష్మాస్వరాజ్ తెలుగు మాటలు

swraj_vid-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (టీ న్యూస్): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై శుక్రవారం నాడు లోక్‌సభ దద్దరిల్లిపోయింది. వాద ప్రతివాదాలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు.. విమర్శలతో హోరెత్తిపోయింది. కుటిల సమైక్యవాదం.. లోక్‌సభ సాక్షిగా పటాపంచలైంది. అడ్డగోలు వాదన మినహా సూటిగా సమాధానాలు చెప్పలేని దైన్యంలో సీమాంవూధవాదం చిన్నబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత యావత్ భారతానికి చేరింది. మొట్ట మొదటిసారిగా తెలంగాణపై సుదీర్ఘ చర్చకు లోక్‌సభ వేదికైంది. తెలంగాణ ఆర్తిని, ఆత్మబలిదానాలను, రాష్ట్రం ఏర్పాటు అవసరాన్ని భారతజాతికి కళ్లకు కట్టినట్లు తెలియజెప్పడంలో తెలంగాణ ఆడబిడ్డ పాత్ర సమర్థంగా పోషించి, వూపతిపక్ష నేత సుష్మాస్వరాజ్ విజయవంతమయ్యారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ సైతం తెలంగాణ నా జన్మహక్కు అంటూ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ స్థాయిలో గట్టిగా వినిపించారు.

తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను సవివరంగా ప్రస్తావించిన సుష్మ.. వివిధ ఒప్పందాలు ఉల్లంఘనకు గురైన తీరును ఎండగట్టారు. తాజా శ్రీకృష్ణ కమిటీ బండారాన్ని బయటపెట్టారు. నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా సుష్మ చేసిన ప్రసంగంతో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి కావూరి సాంబశివరావు బిత్తర పోయారు. హోం మంత్రి చిదంబరం సమాధానాలు వెతుక్కునే పనిలో పడిపోయారు. చివరికి కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు. పాత పాటలనే వల్లెవేశారు. ఓ దశలో సుష్మ ప్రసంగంతో కంగుతిన్న చిదంబరం.. తమ చేతిలో ఏమీ లేదని, తేల్చుకోవాల్సింది ఆంధ్రవూపదేశ్‌లోని రాజకీయ పార్టీలేనని పాత మాటలనే పునరుద్ఘాటించారు. తమ పార్టీలోనూ ఏకాభివూపాయం లేదని ఒప్పుకున్నారు.

సుష్మ మాట్లాడుతుంటే కావూరి సాంబశివరావు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి అడ్డదిడ్డమైన వాదన చేశారు. కానీ.. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటమేంటన్న కావూరి వాదనను సుష్మ దీటుగా తిప్పి కొట్టారు. కేంద్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని చెప్పారు. గతంలోనూ తెలంగాణ కోసం మాట్లాడింది తామేనని చెప్పారు. కావూరికి బాసటగా మరో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి నిలిచినా.. సుష్మ వాగ్ధాటితో మిన్నకుండిపోయారు. అర్థవంతమైన చర్చ జరగలేదని చిదంబరం తేల్చినా.. తెలంగాణపై కాంగ్రెస్ కచ్చితమైన నిర్ణయానికి రాలేదన్న వాస్తవం బయటపడింది. దీంతో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి రావచ్చునన్న వాదన వినిపిస్తున్నది. పార్టీకి విధేయతతో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమవుతామంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదని పలువురు తెలంగాణవాదులు అంటున్నారు.

మొత్తం మీద మూడు నెలల్లో చర్చల ప్రక్రియను ముగిస్తామని చిదంబరం ప్రకటించడంతో సావధాన తీర్మానం లక్ష్యం కొంతలో కొంత నెరవేరిందనే చెప్పొచ్చు. చిదంబరం ప్రకటన నేపథ్యంలో మరో మూడు నెలల్లోగా తెలంగాణపై ఒక నిర్ణయం వెలువడుతుందనే ఆశ ప్రజాస్వామ్యవాదుల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొంది. అటు తెలంగాణపై పార్లమెంటులో గంటన్నర పాటు సాగిన చర్చ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపనుండటంతో అధికార పార్టీ కొంత ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణపై నిర్ణయం వెలువరించే ముందు రాష్ట్రంలో జరిగే లాభ నష్టాలను మాత్రం బేరీజు వేసుకుంటున్న అధికార పార్టీ, తాజా విస్తృత చర్చ అనంతరం తన పరిధిని విస్తరించుకోవచ్చన అభివూపాయం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. రాజకీయ అవసరాల కోసం వాటిని తుంగలో తొక్కిందనే వాస్తవం చర్చ ద్వారా బహిరంగమవడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇకపై కాంగ్రెస్ చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండబోదు.

ఆ దిశలోనే బీజేపీ చేసిన కృషి ఫలించిందని నిపుణులు అంటున్నారు. లోక్‌పాల్, ధరల పెరుగుదల, అవినీతిపై ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పెట్టలేక పోయిన బీజేపీ, తెలంగాణపై జరిగిన చర్చలో మాత్రం పై చేయి సాధించింది. అన్ని విషయాల్లో ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చే అధికార పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం పార్లమెంటు సాక్షిగా తానే చీలిపోయింది. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను కట్టడి చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, హోం మంత్రి చిదంబరం తలపట్టుకున్నారు. పార్లమెంటు గత సమావేశాల్లో నిరసన తెలిపిన టీ ఎంపీలను బెదిరించి బయటకు పంపిచినవూపణబ్ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర నాయకుల పట్ల ఉదాసీనత ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలు కావూరి, లగడపాటి, ఆనంత, రాయపాటి, సబ్బం హరి తదితరులు చర్చకు ఆడుగడుగునా అడ్డుతగిలారు.

సావధాన తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించిన వెను వెంటనే కావూరి లేచి నిలబడి ‘‘రాష్ట్రం గురించి వాస్తవాలు, గణాంకాలు తెలియని సుష్మ.. రాజకీయ కారణాలతోనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు’’ అని ప్రతిపక్ష నాయకురాలిని అవమాన పరిచే విధంగా వ్యవహరించారు. తామంతా చర్చకు అనుమతివ్వాలని ఎన్నిసార్లు కోరినా నిరాకరించి, బీజేపీకి అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్ అధికారాన్నే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అడ్డు తగలొద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రశాంతంగా చర్చ జరగకుండా సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రం నుండి ఒక్క ఎంపీలేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటం దయనీయం…. రాష్ట్రంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు.. అంటూ సుష్మ ప్రసంగిస్తుండగానే రన్నింగ్ కామెంటరీలకు దిగారు.

మాట్లాడటానికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా.. తెలంగాణ విషయంలో తమ వైఖరి తప్ప మరో వైఖరి వినిపడకూడదనే తీరుగా ప్రవర్తించారు. అమరుడైన యాదిడ్డి ఆత్మహత్య లేఖలోని అంశాలను సభ దృష్టికి తేవాలని సుష్మాస్వరాజ్ ప్రయత్నిస్తుంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి లేఖ ఆయన వ్యక్తిగతమని, దాన్ని మీరెలా చదువుతారని కావూరి అభ్యంతరం పెట్టారు. యాదిడ్డి రాసిన లేఖ ఆయన రాసిందేనా? అన్న విషయం తేలాల్సి ఉందని అమరులను చులకన చేసి మాట్లాడారు. ఇక తమ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా తెలంగాణ కోసం అందరూ రాజీనామాలు చేస్తే నువ్వేందుకు సభకొచ్చావంటూ వెటకారాన్ని ప్రదర్శించారు. ‘తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు కదా’ అంటూ తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆత్మహత్యలే శరణ్యం అన్న విధంగా వ్యవహరించారు.

తెలంగాణకు మద్దతిస్తున్నా… ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలను గౌరవిస్తున్నానని గురుదాస్ దాస్ గుప్తా చెప్పినపుడు వీరావేశంతో బల్లలు చరిచిన సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రా ప్రాంతం మొత్తం ఆగం కావొద్దనే అర్థంతోనే ఆయా ప్రాంతాను గౌరవిస్తున్నానని గురుదాస్ పేర్కొనడంతో చిన్నబుచ్చుకున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతున్నామని అసత్యాలు పలికే సీమాంధ్ర నాయకులు, అక్కడి ప్రజలు బాగుండాలని ఎవరైనా కోరుకుంటే మాత్రం బల్లలు చరచలేని దైన్యంలో పడిపోయారు. చివరిలో మాట్లాడిన చిదంబరం.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. బంతిని రాష్ట్ర పార్టీల కోర్టుల్లోకి నెట్టారు. తెలంగాణ అంశంలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది ఆయా పార్టీలేనని తేల్చారు.

రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ప్రధాన పార్టీల్లో నాలుగుకుపైగా పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని ఇంత వరకూ ఖరారు చేసుకోలేదని చెప్పారు. ‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడేవారి నుంచి, ఆంధ్రవూపదేశ్ ప్రజల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుపోవటమే చేయగలదు. పార్లమెంటు కూడా ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడమే చేయగలదు’’ అని చిదంబరం చేతుపూత్తేశారు. బీజేపీ సభ్యులు గోపీనాథ్ ముండే, రమేష్ కూడా చర్చలో పాల్గొనాల్సి ఉన్నా వారు ఉపసంహరించుకున్నారు.

తెలంగాణ చరిత్ర

telangana

భారత దేశానికి ప్రపంచం లో ఎంత చరిత్ర కలదో తెలంగాణ కు కూడా అంతే చరిత్ర కలదు. ఆ చరిత్ర ఏమిటంటే….. !

వివాహాది శుభ కార్యాలలో బ్రహ్మనోత్తములచే

“జంబూద్వీపే భరత ఖండే దక్షిణ పదే అస్మకం” అనే శ్లోకం వింటునే వుంటున్నాం ఈ అస్మక ప్రాంతమే తెలంగాణా ప్రాంతం .

కృత యుగం (వేదకాలం) లో జంబూద్వీపం నుండి హిమాలయాలకు వెళ్ళే ఋషులు ఆర్మూర్ లో ని నవ నాథుల సిద్ధుల గుట్ట వద్ద ,మునులు మొర్తాండ్ మండలం లో ని మునుల గుట్ట వద్ద విశ్రాంతి తీసుకొని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకునేవారు.ఇలాంటి ప్రాంతాలు తెలంగాణ లో కలవు.

త్రేతాయుగం లో ఈ ప్రాంతం దండకారణ్యం గా పిలువ బడేది. ఈ యుగం లో శ్రీ రాముడు ,సీతమ్మ,లక్ష్మణులసమేతంగా అయోధ్య నుండి త్రివేణి సంగమం నాకు వచ్చినారు.ఆనతి ఆ త్రివేణి సంగమమే నేటి రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామము. ఈ త్రివేణి సంగమ్మ తెలంగాణా లో వుండడం తెలంగాణా వారికెంతో పుణ్యఫలం . శ్రీరాముడు ,సీతమ్మ,లక్ష్మణులు గోదావరి నది తీరం వెంబడి వెళ్తు ఖమ్మంలోని భద్రాచలం లో కొలువైనారు. అదే కాలం లో రత్నాకరుడనే గజ దొంగ నారదుని చేత జ్ఞానోదయం పొంది వాల్మీకి గ మారి రామాయణ మహా కావ్యాన్ని రచించాడు .అతడు జ్ఞానోదయం పొందిన ప్రాంతమే నవీపేట్ మండలం లోని కస్పబినోల గ్రామము. నేటికి ఇచ్కాత వాల్మీకి సమాది కలదు.అతడు “కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషు లావు తారు” అనే వాక్యం నిజం చేసినారు. వాల్మీకి తెలంగాణా ప్రాంత వాసి కావడం ఈ ప్రాంత ప్రజల కెంతో గర్వ కారణం.

ద్వాపర యుగం లో పాండవులు హస్తినపురం (డిల్లీ) నుండి అజ్ఞాత వాసం లో దక్షిణ భారత ప్రాంత మైన అస్మకం చేరినారు. ఈ ప్రాంతం లో బకసూరుడనే రాక్షసుడు తిని,త్రాగి ప్రజలను హింసిస్తుండే వాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు చంపినాడు. ఆ నాటి ఆ ప్రాంతమే నేటి భోధన్ లోని రాకాసి పేట్. నేడు దీనిని భీముని గుట్ట అంటున్నారు. పాండవులు ఈ ప్రాంతం రావడం ఇక్కడి వారి అదృష్టం . ఇదే యుగం లో మహా భారత రచయిత వ్యాస మహర్షి కాశి నిండి తీర్ద యాత్రలు చేస్తూ అస్మకం ప్రాంతం చెంత గోదావరి తీర ప్రాంతమందు జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీ మాత ని ఆదిలాబాద్ లో ప్రతిస్తాపన చేసినారు. నాటి వ్యాసపురి ఐన వాసర క్షేత్రం నేడు బాసర గ ప్రసిద్ది చెందినది. వ్యాసుడు తెలంగాణా ప్రాంతం లో జ్ఞాన సరస్వతీని ప్రతిస్తాపన చేయడం తెలంగాణా ప్రజల కు మహా వరం లాంటిది.

క్రీ.పూర్వము 6వ శతాబ్దము గౌతమ బుద్దుని పరిపాలనలో అఖండ భారత షోడశామహజన పదా(౧౬ రాజ్యాలు) లతో ఆర్థిక రాజకీయ నైతిక మరియు సాంస్కృతిక రంగాలలో అత్యంత వైభవంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండేది . ఈ షోడశ మహా జన పదాలుగాంభోజ,గందార,కురు,మత్స్య,శూరుసేనా,

పాంచాల,కోసల,మల్ల,చెడి,వాత్స్య,కాశి,వజ్జీ,అంగ,మగధ, అంతి మరియు అస్మక ౧౬ జాణ పదాల లో ౧౫ ఉత్తర భారత దేశం లోఉంటే అందులో ఒకే జానపదం “అస్మక” దక్షిణ భారత దేశం లో గోదావరి కృష్ణ నదుల మద్య ఉండేది. ఈ ప్రాంతపు గొప్ప పరిపాలన గురించి గ్రీకు రాజి న అలెగ్జన్దర్ రాయబారి మొగస్తానీసు తనచే వ్యాయబడిన “ఇండికా” అనే గ్రంధం లో పేర్కొన్నారు. ఈ అస్మక ప్రాంతం అపారమైన జల వనరులు౯చఎరువులు) విస్తారమైన అటవీ సంపదతో నా తెలంగాణా కోటి రతనాల వీణా గా చరిత్రలో నిలిసినది. ఇతర దేశాలైన గ్రీకు,రోమ్,చైనా,మోసపోతేమియా,హిబ్రూ,జేరుసాలెం లాంటి ప్రపంచదేశాలతో స్నేహ సంభందాలు ఏర్పాటు చేసుకున్నది.

ఆసియా ఖండం లో నే అతిపెద్దధైన నిజాంషుగర్ ఫ్యాక్టరీ వ్యవసాయంలో అగ్రగామి గ ఉండేది . చారిత్రాత్మక కట్టడాల తో పాటు హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం మతాలతో భిన్నత్వం లో ఏకత్వంగా ఉండేది. భౌగోళిక పరంగా ఈ ప్రాంతం “దక్కన్’ ప్రాంతం గ వర్ణించబడింది.ఉర్దూ లో దక్కన్ అంతే మూట లేదా ఎత్తైన ప్రాంతం . నాటి నుంచి నేటి వరకు తెలంగాణా ప్రాంతంలో అనేక ఉర్దూ పదాలు (దావఖాన,సడక్,) అగుపడుతున్నవి. అలాంటి ఒక ఉర్దూ పదమే “లష్కర్” .లష్కర్ అంతే తెలుగు లో సైనిక స్థావరం,ఇంగ్లీష్ లో “కంటోన్మెంట్”

స్వాతంత్ర్యానికి పూర్వం యావత్ భారత దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తునతే ఆపారమైన వనరులున్న దక్కన్ ప్రాంతాన్ని నైజాం పరిపలిస్తుండే వాడు . దక్కన్ ప్రాంతాన్ని ఆంగ్లేయుల ఆదినం లో కి వెళ్ళకుండా నైజాం తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ ప్రాంతం గ ఏర్పాటు చేసినాడు.లష్కర్ అంటేనే సైనిక స్థావరం . ఈ సైన్యం లో ఉన్నా సైనికులు తమ విధి నిర్వహణలో నిర్భయంగా ఉండాలి . ఈ నిభాయత్వం సింహం లో అగుపడుతున్నది.సింహం మహంకాళి యొక్క వాహనం కావున సైన్యం లోని ప్రతీ సైనికుడు సింహం లాగ ఉండడానికి మహంకాళి ని పూజించారు. బోనం అంటే ఘటిక తో తయారు చేయబడిన ప్రసాదం. నాటి లష్కర్ సికింద్ర బాద్ లోని మహంకాళి కి బోనం పెట్టి లష్కర్ బోనాల పండుగ జరుపుకొని ఆంగ్లేయుల పాలనను అడ్డుకున్నారు.

స్వాతంత్ర్యమ అనంతరం ౧౯౫౫ లో యావత్తూ భారత దేశం లోని అగ్ర గామిగా ఉన్నా తెలంగాణా ప్రాంతం పై ఆంద్ర నాయకుల కన్ను పడింది. నాటి రాజకీయ నాయకులు అమాయకురాలైన అమ్మాయిని (తెలంగాణా) గడసరి అబ్బాయితో( ఆంధ్ర) తో పెళ్లి చేస్తున్నాను. కలిసి ఉంటేవున్దవచ్కూ లేదా విడిపోవచ్చు అంటు ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలను కలుపుతూ విశాలంద్రాగా మార్చినారు . ౧౯౫౬ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు లక్షల ఉద్యోగాలు కొల్పొఇ యువతీ యువకులు పెడదారి పడుతున్నారు .

నక్సలైట్లు గా మారుతున్నారు. ఉద్యో గాలు లే క బతుకు జీవుడా అంటూ. గల్ఫ్ ప్రాంతం వెళ్లి బానిస బతుకులు బతుకుతున్నారు . అన్నదాతలు గ ఉండవలసిన రైతన్నలు అప్పులు తీర్చలేక అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నా తెలంగాణా కోతి రతనాల వీణా గ వున్నా ఉన్నా ప్రాంతం లో నేడు నిత్యమ జరుగు తున్న చరిత్ర ఇది . అందుకే మనమందరం కుల, మాట రాజకీయాల కు అతీతం గా తెలంగాణా రాష్టం ఏర్పాటుకు కట్టుబడి తెలంగాణా రాష్ట్రాన్ని సాదించుకుందాం ..!

నవంబర్ 1న తెలంగాణ ‘విద్రోహదినం’

“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప

మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు,

బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు.

రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు.

అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో,

తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున

కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో

తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం.

నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా

తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు,

సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం.

తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ప్రకటిద్దాం.”


తెలంగాణ కోరుకుంటున్నదీ ఇదే. అన్నదమ్ముల్లా విడిపోదాం! ఆత్మీయుల్లా కలిసుందాం!!

చిల్ బ్రేకప్

chillbreakup-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

పావని, కళ్యాణ్ మంచి స్నేహితులు. ఈ మధ్య వారి స్నేహం చెడిపోయింది. సింపుల్‌గా ఎస్‌ఎంఎస్ చేసి కటీఫ్ చెప్పాడు కళ్యాణ్. ఇప్పుడు వారి మధ్య నో ఫోన్స్, నో మిస్డ్ కాల్స్ అనుకుంటున్నారేమో! అదేంలేదు. ఒక లేట్ నైట్ ఫోన్ కాల్స్ తప్ప. 

బాలు బైక్‌పై ఒక అమ్మాయితో అపర్ణకి కనిపించాడు. ఇంకేముందీ ఇద్దరి లవ్‌కి బ్రేక్ పడింది. ఆ అమ్మాయి ఎవరో చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదా అపర్ణా?… ఇచ్చింది. మాట్లాడుకున్నారు. ఫ్రెండ్లీగానే విడిపోయారు. బ్రేకప్ పార్టీ ఇచ్చి మరీ విడిపోయారు. 

రియల్లీ.. 
బ్రేకప్ ఇప్పుడొక సెలవూబేషన్. స్నేహితులు.. ప్రేమికులు ‘బ్రేకప్ పార్టీ’తో విడిపోవడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది. 
ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అమితాబ్ బచ్చన్.. మిగిలినవారంతా ఇండియా గెలిస్తే.. ‘డెయిరీ మిల్క్’ తిందామని ఎదురుచూస్తుంటారు. బట్.. ఇండియా ఓడిపోతుంది. అయితేనేం.. పాకిస్తాన్ గెలిచిందిగా! అని డెయిరీ మిల్క్ తినేస్తారు అందరూ. 
‘తియ్యని వేడుక చేసుకుందాం..’ అంటాడు అమితాబ్. 
ఈ ఇన్‌స్పిరేషన్‌తోనే సెలవూబేట్ చేసుకోవడానికి.. గెలుపయితేనేం. ఓటమయితేనేం? అంటోంది నేటితరం. 
విడిపోవడం అంటే.. ఓడిపోవడం. 
కానే కాదు.. మళ్లీ కలవాలంటే.. విడిపోక తప్పదుగా అన్నది కొత్త సిద్ధాంతం. 
ఫ్రెండ్లీగా విడిపోతే తప్పులేదు. 
అసలు ఈ ఐడియా బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీది. 
ఇక్కడ ఆయన తీసిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమా గురించి చెప్పుకోవాలి. 
సైఫ్ ఆలీఖాన్, దీపికా పదుకోన్ అందులో హీరో హీరోయిన్లు. ఇద్దరూ అమెరికాలో ఉంటుంటారు. దీపికా తన ప్రొఫెషన్‌ని ఇండియాలో కొనసాగించాలనుకుంటుంది. సైఫ్ యుఎస్‌లోనే సెటిలవ్వాలనుకుంటాడు. ఈ డిఫన్స్ వల్ల ఇద్దరూ విడిపోవాలనుకుంటారు. అదీ ఫ్రెండ్లీగా. ఇట్స్ ఏ కూల్ బ్రేకప్ అన్నమాట. ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పార్టీ ఇచ్చి మరీ విడిపోతారు. 
ఇదే సినిమాని ‘తీన్‌మార్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ ఉన్నాయి. ‘ఏ రిలేషన్ వితౌట్ ఎనీ రిలేషన్‌షిప్’ అంటుంది హీరోయిన్ మధుమతి(భూమిక). 
సినిమాలు చూసి ఇన్‌సై్పర్ అయ్యే ఈ తరం.. దీన్నే ఇప్పుడు ట్రెండ్ అనుకుంటోంది. 
జరిగేదంతా మన మంచికే. ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.. అంటూ ఈజీగా కటీఫ్ చేప్పేస్తున్నారు.

lovers-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaమూడేళ్ల క్రితం గాళ్‌వూఫెండ్‌కి బ్రేకప్ చెప్పి రెండేళ్లు విడిపోయిన శ్రవణ్ ఇప్పుడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ‘‘మా ఇద్దరికీ చిన్న విషయంలో పడలేదు. జీవితాంతం ఇలాగే ఉండాలా? అనిపించింది. విడిపోదామనుకున్నాం. అదీ ఫ్రెండ్లీగా. ఏడాది గడిచింది. అప్పుడప్పుడూ కలుసుకున్నాం. కానీ అంతకు ముందు ఉన్న సాన్నిహిత్యం ఉండేది కాదు. మళ్లీ ప్రేమ చిగురించింది. ఇప్పుడు మా ప్రేమ చాలా స్ట్రాంగ్. పదో తరగతి నాలుగు సార్లు చదివినంత స్ట్రాంగ్’’ తన ప్లస్ వన్ లవ్‌స్టోరీ గురించి చెప్పాడు శ్రవణ్. 
‘‘సిద్ధూ నాకన్న టు ఇయర్స్ చిన్నవాడు. ఆ విషయం దాచిపెట్టాడు. కోపమొచ్చింది. కొట్టాలనిపించింది. తిట్లతో సరిపెట్టాను. ఇక లైఫ్‌లో ఎప్పటికీ నీ మొహం చూపించకు అన్నాను. విడిపోయాం. జస్ట్ కిట్ క్యాట్ బ్రేక్. ఇప్పుడు మేం మంచి ఫ్రెండ్స్’’ తన బ్రేక్ అప్ గురించి ఇలా చెప్పింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనన్య. 

ఒక రిలేషన్ షిప్‌ని బ్రేక్ చేయడమంటే ఈ జనరేషన్‌కి చాలా నార్మల్ థింగ్. ఒక ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగంలో చేరినట్లు.. అంగీ విప్పి.. టీషర్ట్ వేసుకున్నట్లు.. చాలా సింపుల్. 
పగిలిన హృదయం పద్మవ్యూహం. చేధించడం చాలా కష్టం. ప్రేమలోనో, స్నేహంలోనో మనస్పర్థలు రావడం సహజం. విడిపోవాలనుకోవడం సరే. కానీ దానికీ ఓ పద్ధతుండాలి కదా? ఎప్పుడు పడితే అప్పుడు. ఎక్కడంటే అక్కడ.. ఎలాగైతే అలా విడిపోతే.. అంతవరకూ ఉన్న బంధానికి అర్థమేంటి? అని ప్రశ్నిస్తే అదంతా వారికి నాన్సెన్స్. మనకే చాదస్తం అంటారు. క్లాస్ పీకుతున్నామని కామెంట్ చేస్తారు. 

girl-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

అంత మాటెందుకుపూండి అంటారా? అందుకే.. 

మనుషుల మధ్య మనస్పర్థలు వస్తే విడిపోండి-
అని నేను చెప్పడం లేదు. అలా చెప్పడం తప్పే. కాదనను. కానీ తప్పని సరి పరిస్థితుల్లో తప్పు చేయడంలో తప్పులేదు కదా. కష్టంగా కలిసుండడం కంటే ఇష్టంగా విడిపోవడం బెస్ట్ కదా. 
ఇప్పుడు

తెలంగాణ కోరుకుంటున్నదీ ఇదే. 
అన్నదమ్ముల్లా విడిపోదాం! ఆత్మీయుల్లా కలిసుందాం!!

ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా? 
ఎవ్రీ డాగ్ యాజ్ ఇట్స్ ఓన్ డే అన్నట్లు. ప్రతి వేడుకకీ ఒక రోజుంటుంది. బ్రేకప్ సెలెవూబేషన్‌కీ ఒక రోజుంది.. అదే జూన్ 2. అన్ని అంశాల్లాగే ఈ బ్రేకప్ కల్చర్ కూడా మనదేశానికి దిగుమతి అవుతోంది. అందుకే సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సంఖ్య పెరుగుతోంది. వారి కేసులూ వృద్ధి అవుతున్నాయి. దీనికి తోడు ఇంటర్‌నెట్‌లో కూడా ప్రత్యేక పోర్టల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లు ఎలా విడిపోవాలో చెబుతూనే.. విడిపోయాక ఎలా సరై్వవ్ కావాలో కూడా చెబుతున్నాయి. thebreakupsurvivor.com అనే వెబ్‌సైట్ ఎందుకు విడిపోవాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా విడిపోవాలి తదితర అంశాలపై సలహాలు ఇస్తోంది. విడిపోయిన తర్వాత ఎలా మనగల్గాలి, బ్రేకప్ లైన్స్, ఈ-బుక్స్‌ని సైట్‌లో పొందుపర్చింది. 

తెలంగాణ నా జన్మహక్కు – సభలో గర్జించిన సర్వే

– తెలంగాణ ఒక ప్రత్యేక దేశం కూడా

– సీమాంవూధులు ఆనాడు మద్రాస్ అన్నారు
– ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు
– హైదరాబాద్ తెలంగాణకు తలలాంటిది
– మొండెం నుంచి తలను వేరు చేయొద్దు
– కాలయాపన చర్చలొద్దు
– పార్లమెంటులో నిర్ణయిస్తే చాలు
– వెంటనే రాష్ట్రం ప్రకటించాలి
– అడ్డుతగులుతూ అనవసర వ్యాఖ్యలు
– నైజం చాటుకున్న సీమాంధ్ర ఎంపీలు
Hanu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, ఆగస్టు 5 (టీ న్యూస్): తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా తెలంగాణ ఎంపీ సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి) ప్రసంగం ఆయన మాటల్లో..

నాకు రాజకీయ జన్మనిచ్చిన సోనియాగాంధీ ఇక్కడ ఉంటే తెలంగాణ ఇచ్చి ఉండేవారు. అనారోగ్యంతో ఉన్న ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రజల తరుపున దేవున్ని ప్రార్థిస్తున్నా. సుష్మాస్వరాజ్ అన్నట్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగానే గాక ప్రత్యేక దేశంగా ఉండేది. తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుమీద మద్రాసు నుంచి విడిపోయిన సీమాంవూధతో కలిపారు. అప్పుడు మద్రాసు గురించి మాట్లాడిన సీమాంవూధులు ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ మాటకు అనుగుణంగానే అవసరం అనుకున్నప్పుడు సీమాంవూధతో విడాకులు తీసుకుంటాం. కాంగ్రెస్ నాయకురాలు సోనియా తెలంగాణపై కొనసాగుతున్న వివక్షను అర్థం చేసుకున్నందునే తెలంగాణ ఇస్తుందనే విషయం తెలుసు. తెలంగాణ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ అందరూ నివసించవచ్చు. కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రావాలా భాగో అనే నైజం మాది కాదు. చిన్న రాష్ట్రాలే వేగవంతంగా ప్రగతిని సాధిస్తాయి. (తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు అని సీమాంధ్ర నాయకులు కామెంట్ చేయగా..) యాదిడ్డిలాంటి పిల్లలు బలిదానాలు చేసుకోవద్దనే తెలంగాణకోసం కాంగ్రెస్ సభ్యులుగా ఆత్మహత్య చేసుకుంటామన్నాం. మా ప్రజలను చావనియ్యం. బాలగాంగాధర్ తిలక్ స్ఫూర్తిగా తెలంగాణ మా జన్మహక్కు. రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించండి. పసంగాన్ని తొందరగా ముగించాలని స్పీకర్ కోరగా) తెలంగాణ ప్రజలు చస్తున్నారు.. సుష్మాలాగా సీనియర్ కాకపోయినా తోటి సహచరులు రాజీనామా చేసినందున మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి.

ఉద్యోగుల సమ్మె, టీ మంత్రుల రాజీనామాలతో రాష్ర్టంలో పాలన అస్తవ్యస్థమైంది. (మరి మీరు రాజీనామా చేయలేదేం అన్న మాటలపై) నేను, అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామాచేస్తే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతారని రాజీనామా చేయలేదు. నాయకురాలిని ధిక్కరించను. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన (తెలంగాణ) కానుకను వెనక్కు తీసుకోరు. కొందరు ఆటంకాలు కల్పించి తెలంగాణను అడ్డుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. అది ఎవ్వరి జాగీరు కాదు. హైదరాబాద్ తెలంగాణకు తల లాంటిది. మొండెం నుంచి తలను వేరు చేయొద్దు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి. విభజన, సమైక్యత అన్న రెండే రెండు అంశాల మీద నివేదించాల్సిన శ్రీ కృష్ణ కమిటీ ఇదంతా చెప్పడం అనవసరం.

అది రాజకీయ రిపోర్టు. ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లతో తెలంగాణకు న్యాయం జరగదు.. తెలంగాణ ఏర్పాటుతోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవతుంది. నిర్దిష్ట కాలపరిమితి లేకుండా చర్చలు చేయడం అనవసరం. తెలంగాణ విషయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. యూపీని విభజించడానికి రెండో ఎస్సార్సీ అని అధిష్టానం అంటుంటే సీమాంవూధులు తెలంగాణకు కూడా అదే సూత్రంతో లింకు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డా సీమాంవూధులు అడ్డుకోవటంవల్లే తెలంగాణ రాలేదు. తెలంగాణను తాత్సారం చేస్తున్నందునే పిల్లలు మరణిస్తున్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి వీడాలి.

బలిదానలు చేస్తూ బూడిద కావొద్దురా

తెలంగాణ పిడికిలి పట్టు

బలిదానలు చేస్తూ బూడిద కావొద్దురా

“విధ్యార్థులంటె నేల తల్లి లాంటి వాళ్ళురా

జాతి భారన్నంత భుజాన మోసేటోళ్ళు రా

విధ్య దశ నుండే విశ్వవిజేతలవుతారు

రావివేకనందుడికి ఆనవాళ్ళు మీరు రా ”

ప్రశ్నించెటోళ్ళు మీరు- ఆ ప్రశ్నకు బదులు మీరు

ప్రశ్న జవాబులతో -ప్రణాళికలు రాసెటోళ్ళు

బలిదానలు చేస్తు బూడిద కావొద్దురా


నడిపించేటోళ్ళు మీరు- తూలి పడితే ఎట్లారా?

మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నడువలేరురా

కన్నీళ్ళు తుడిచే మీరు తూలి పడితే కాటికెల్తే ఎట్లారా?

నాలుగు కోట్ల ప్రజలు భాధపడుతారురా

వేదన తీర్చుట కై ఆవేదన చెందినోళ్ళు

ఆవేశపూరితంగా ఆహుతైతే ఎట్ల రా